Sunday, 27 March 2016

Curd Rice With Fruits Recipe in Telugu - ఫ్రూట్ అండ్ కర్డ్ రైస్ రిసిపి

ఫ్రూట్ అండ్ కర్డ్ రైస్ రిసిపి : సమ్మర్ స్పెషల్

కావల్సిన పదార్థాలు: 
రైస్       : 1cup (ఉడికించిన) 
పెరుగు  : 1cup 
పాలు    : 1/2tsp
ద్రాక్ష     : 2tsp
షుగర్ : 1/2tsp
ఉప్పు : చిటికెడు
చెర్రీ: 2 tsp
కొత్తిమిర: 1 రెమ్మ (సన్నగా తరిగినవి)
ఆవాలు: 1 tsp
నూనె : 1 tsp
దానిమ్మ : 2tsp
పచ్చి మిరపకాయలు: 2 (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
బాదం: గుప్పెడు చూపడంతో (చిన్న తరిగినవి)

తయారుచేయు విధానం : 
1.ముందుగా వండి పెట్టుకొన్న అన్నంకు కొద్దిగా ఉప్పు మరియు పంచదార మిక్స్ చేసి గరిటతో బాగా మిక్స్ చేయాలి. 
2. ఇప్పుడు అందులో తాజా పెరుగు, పాలు, పెరుగు, ద్రాక్ష, చెర్రీ వేసి బాగా మిక్స్ చేయాలి. 
3. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు వేసి చిటపటలాడిన తర్వాత పచ్చిమిర్చి వేసి రెండు నిముషాలు మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. 
4. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి ముందుగా ఉప్పు, పంచదార మిక్స్ చేసిన అన్నంను పోపులో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకొన్న కొత్తిమీర తరుగు మరియు సన్నగా తరిగిన బాదంను వేసి గార్నిష్ గా తయారుచేసుకోవాలి . అంతే రుచికరమైన ఫ్రూట్ కర్డ్ రైస్ రెడీ.

No comments:

Post a Comment