బీట్‌రూట్ పచ్చడి ::
కావలసినవి:
బీట్‌రూట్ తురుము - కప్పు
ధనియాలు - 2 టీ స్పూన్లు;
శనగపప్పు - టీ స్పూను;
మినప్పప్పు - టీ స్పూను
ఎండుమిర్చి - 5;
చింతపండు - కొద్దిగా
ఉప్పు - తగినంత;
నూనె - 2 టీ స్పూన్లు
బీట్‌రూట్ తురుము - కప్పు
ధనియాలు - 2 టీ స్పూన్లు;
శనగపప్పు - టీ స్పూను;
మినప్పప్పు - టీ స్పూను
ఎండుమిర్చి - 5;
చింతపండు - కొద్దిగా
ఉప్పు - తగినంత;
నూనె - 2 టీ స్పూన్లు
పోపుకోసం:
ఆవాలు - పావు టీస్పూను
మినప్పప్పు - పావు టీ స్పూను
కరివేపాకు - ఒక రెమ్మ;
ఎండుమిర్చి - 3
ఇంగువ - చిటికెడు;
నూనె - టీ స్పూను
ఆవాలు - పావు టీస్పూను
మినప్పప్పు - పావు టీ స్పూను
కరివేపాకు - ఒక రెమ్మ;
ఎండుమిర్చి - 3
ఇంగువ - చిటికెడు;
నూనె - టీ స్పూను
తయారి:
1. బాణలిలో నూనె కాగాక అందులో ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. కొంచెం వేగాక ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి.2. ఇవి వేగాక తీసి పక్కనపెట్టి, ఇదే నూనెలో బీట్‌రూట్ తురుము వేసి ఒక మోస్తరుగా వేయించాలి.
3. కొంచెం నీళ్లు చల్లి మూతపెట్టి ఉడికించాలి. పై ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు మిశ్రమం చల్లారిన తరవాత అందులో చింతపండు కలిపి మిక్సీలో పొడి చేసుకోవాలి.
4. తరవాత అందులో... ఉడికించిన బీట్‌రూట్, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.
5. బాణలిలో ఒక స్పూను నూనె వేడయ్యాక పోపుదినుసులు వేసి చిటపటలాడాక కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి.
ఈ పోపును పచ్చడిలో కలపాలి. ఇది అన్నంలోకి బావుంటుంది.